Home బాపట్ల ప్రతి అధికారి నాణ్యతతో పనిచేయాలి

ప్రతి అధికారి నాణ్యతతో పనిచేయాలి

7
0

– నిజాంపట్నంను నెలలో టాప్ 3లో ఉండాలి
– నిర్దేశించిన లక్ష్యాలు నిర్ణిత గడువులో పూర్తి చేయాలి
– మండల అధికారులు పోటీ తత్వంతో పనిచేయాలి
– కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, IAS
బాపట్ల (DN5 News) : మండల స్ధాయి అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. పని చేయని అధికారులతో తాను పని చేయిస్తానని అననారు. నిజాంపట్నం మండల స్థాయి అధికారులకు నైపుణ్యాలు మెరుగు పరిచే ప్రత్యేక శిక్షణ (వర్కుషాప్) గురువారం నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ నందు మండల ప్రత్యేక అధికారి, తహశీల్దారు, ఎంపిడిఓతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడానికి గల కారణాలు, నెగటివ్ ఉందంటే ఎందుకు నెగటివ్ ఉందని పరిశీలించుకోని ప్రణాళిక తయ్యారు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో మరుగుదొడ్లు ఎందుకు లేదని, స్వచ్ఛ భారత్ క్రింద మంజూరు చేయాలని అన్నారు. ప్రతి పాఠశాలలో ర్యాంపు, మరుగు దొడ్లు ఉండాలన్నారు. కమ్యూనిటీ భవనాలు 45 చేయాల్సి ఉందని, 10 పూర్తి చేశారని, మిగిలినవి పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ ఎఇలను ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలు నిర్ణిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఉపాధి కూలీలకు వందరోజులు పని దినాలు కల్పించాలని ఏపిఓను ఆదేశించారు.

అనవసరమైన వాట్సాప్ గ్రూపుల నుండి అధికారులు వెంటనే లెఫ్ట్ అవ్వాలని, జిల్లా యంత్రాంగంకు సంబంధించి వచ్చే సమాచారం ఉన్న గ్రూపులోనే అధికారులు ఉండాలని అన్నారు. మండల పర్యటనకు వచ్చినపుడు అధికారులు వచ్చి మండలంలోని సమస్యలు ఆయన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఒక నెల తర్వాత మండలం అన్ని విభాగాలలో టాప్ 3లో ఉండాలని అందుకు అన్నారు. మండల స్థాయి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పోటీ తత్వంతో పనిచేయాలని ఆదేశించారు. మండలంలో అన్ని విభాగాలలో ప్రజా సానుకూలతలో 100శాతం సాధించాలని, మండల ప్రత్యేక అధికారి, తహశీల్దార్, ఎంపిడిఓ సమన్వయంతో పని చేయాలన్నారు.

నియోజకవర్గం, మండల ప్రత్యేక అధికారి అధికారులతో వర్క్ షాప్ నిర్వహించాలని, మండల స్థాయి అధికారుల అందరిని వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయాలని ప్రత్యేక అధికారిని ఆదేశించారు. ప్రత్యేక అధికారి, తహశీల్దార్, ఎంపిడిఓ ఇచ్చే చూచనలు మండల స్థాయి అధికారులు తప్పకుండా పాటించాలని అన్నారు. గ్రామ సచివాలయ సేవాలు, స్కూల్ ఎడ్యుకేషన్ సేవలలో, దిండి సచివాలయ పరిధిలో సచివాలయ సేవలలో నిజాంపట్నం మండలం చివరలో ఉండటానికి గల కారణాలు ఏమిటని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా మత్స్య శాఖ డిడి శ్రీనివాస్ నాయక్, నిజాంపట్నం తహశీల్దారు, ఎం శ్రీనివాసరావు,, ఎంపీడీఓ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.