Home ప్రకాశం ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల తీరు మారలేదు. అవే అబద్దాలు, తప్పుడు ప్రచారాలు

ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల తీరు మారలేదు. అవే అబద్దాలు, తప్పుడు ప్రచారాలు

67
0

– నవరత్నాల పేరుతో మోసాలు చేసింది జగన్ కాదా?
– రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అన్ని హామీల అమలు చేస్తున్నాం
– బాబాయిపై గొడ్డలి వేటు, కోడికత్తి, గులకరాయి డ్రామాలు రక్తి కట్టించిన జగన్ ని మించిన నటుడు ఎవరైనా ఉన్నారా?
– వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం పగటి కల, వచ్చేది కూటమి ప్రభుత్వమే
– ఆదిమూలపు సురేష్ ఇప్పటివరకు 3 నియోజకవర్గాలు మారారు ఈసారి ఎక్కడి పారిపోతారో
– మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

ప్రకాశం/ తూర్పు నాయుడుపాలెం (DN5) : ఆత్మీయ సమావేశాల పేరుతో వైసీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ద్వజమెత్తారు. శుక్రవారం నాడు కొండపిలో వైసీపీ నేతల ఆత్మీయ సమావేశంలో ఆ పార్టీ నేతలు మాట్లాడిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రజలు బుద్ది చెప్పినాసరే వారి తీరు ఏమాత్రం మారలేదని పేర్కొన్నారు. నిస్సిగ్గుగా అవే అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో జరగని అభివృద్ధి, సంక్షేమం తాము ఏడాదిలోనే చేశామని తెలిపార.

జగన్ లా మోసం చేయకుండా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తున్నామని అన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం ఇచ్చామని అన్నారు. మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్లు ఇచ్చామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. నవరత్నాల పేరుతో నవ మోసాలు చేసింది జగన్ కాదా? అని ప్రశ్నించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం పగటి కల అన్నారు. 2029 ఎన్నికల తరువాత రాష్ట్రంలో అంతరించే రాజకీయ పార్టీల జాబితాలో వైసీపీ చేరడం ఖాయం అన్నారు. తాము ఎవరిపైనా అక్రమ కేసులు పెట్టడంలేదని, తప్పు చేసిన వారిపైనే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బాబాయి గొడ్డలి వేటు, కోడికత్తి, గులకరాయి డ్రామాల్లో రక్తి కట్టించిన జగన్ ని మించిన నటుడు ఎవరైనా ఉన్నారా? అని అన్నారు. వైసీపీ నేత ఆదిమూలపు సురేష్ ఒకసారి చొక్కా విప్పినందుకే ప్రజలు అడ్రస్ లేకుండా తరిమేశారని అన్నారు. ఇప్పుడు మళ్లీ నిస్సిగ్గుగా వైసీపీ అధికారంలోకి వస్తే రప్పా రప్పా పాలన సాగిస్తామంటూ మాట్లాడుతున్నాడని అన్నారు.

జగన్ కి అంటే బుద్ది లేదు, గతంలో మంత్రిగా పనిచేసిన సురేష్ కి బుద్ధి లేదా? సురేష్ ఇప్పటి వరకు 3 నియోజకవర్గాలు మారారని, ఈ సారి ఎక్కడికి పారిపోతారో అని ఎద్దేవాచేశారు. వైసీపీ నేత రోజా నగరిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి దిక్కుతోచక ఇక్కడ కొచ్చి పిచ్చి ప్రేలాపణలు పేలుతున్నారని అన్నారు. వైసీపీ హయాంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరిగితే రోజా ఎందుకు నోరు మెదపలేదని అన్నారు. కొండపి నియోజకవర్గమంతా కూటమి పాలనలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తూ ప్రజలంతా ప్రశాంత జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ రాజకీయాలకు, రౌడీ మూకలకు ఇక్కడ స్థానంలేదని అన్నారు.