అమరావతి : ఒక పాకిస్తాన్ కాదు… వంద పాకిస్తాన్‌లు వచ్చినా భారత గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరని విద్యా శాఖ మంత్రి లోకేష్ అన్నారు. ఎందుకంటే భారత్ వద్ద మోదీ అనే మిసైల్ ఉందని అన్నారు. నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్‌కు దిమ్మతిరగడం ఖాయం అన్నారు.
ప్రధాని మోదీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానం ఉందని అన్నారు. ఏపీ ప్రాజెక్టులకు ఆమోదం చెబుతూ మద్దతిస్తున్నారని అన్నారు. 2014లో ఎపిని మెడపట్టి గెంటేశారని, రాజధాని కూడా లేకుండానే విడిపోయామని అన్నారు. చంద్రబాబు ఆత్మస్థైర్యం కోల్పోకుండా రాష్ట్రాన్ని నిలబెట్టారని అన్నారు. చంద్రబాబుపై కోపంతో అమరావతిని పక్కనబెట్టారని, అమరావతికి అండగా ఆంధ్ర ప్రజలంతా మద్దతుగా నిలిచారని అన్నారు. అమరావతికి జైకొట్టిన ప్రతిఒక్కరినీ గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని గుర్తు చేశారు.
ఎన్ని కుట్రలు చేసినా అమరావతి నినాదాన్ని ఆపలేకపోయారని అన్నారు. ఆపేదానికి… పీకేదానికి అమరావతి.. ఇంట్లో పెంచుకునే మొక్క కాదని అన్నారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఆపే ధైర్యం ఎవరికి ఉందని ప్రశ్నించారు. మోదీ చేతులమీదుగా ప్రారంభమవుతున్న అమరావతి అన్‌స్టాపబుల్ అన్నారు. ఏపీలో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని, మోదీ, బాబు ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని లోకేష్ అన్నారు.