Home బాపట్ల విద్యార్ధినులకు వ్యాసరచన పోటీలు

విద్యార్ధినులకు వ్యాసరచన పోటీలు

9
0

చీరాల (DN5 News) : స్థానిక పోలీసు అధికారులతో కలిసి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవంలో భాగంగా మహిళల గౌరవం, సమాజ గౌరవం, మహిళలపై హింసకు నో చెప్పండి అంశంపై ప్యాచరచన పోటీలు శక్తి టీం నిర్వహించారు. ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు డిఎస్పి ఎండి మోయిన్ సూచనలతో చీరాల వన్ టౌన్ పట్టణ సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో వన్ టౌన్ పట్టణ ఎస్‌ఐ వెంకటేశ్వరరెడ్డి, సబ్ డివిజన్ శక్తి బృందం సభ్యులు పిసి కె సుబ్బారావు, చీరాల ఒకటో పట్టణం పరిధిలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు మహిళల గౌరవం-సమాజ గౌరవం మహిళలపై హింసకు నో చెప్పండి అంశంపై ప్యాచరచన పోటీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు ‘శక్తి యాప్’ గురించి వివరించారు. అత్యవసర సమయంలో మహిళలు తక్షణ సహాయం పొందేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలను అరికట్టడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తూ, ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే వెంటనే తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల్లో వచ్చే అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని తెలిపారు.

ఏదైనా సమస్య తలెత్తితే ఆ సమస్యను బట్టి వెంటనే హెల్ప్ లైన్ నెంబర్లు 112, 181, 1091, 1098 లకు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోక్సో) గురించి కూడా వివరించారు. కార్యక్రమంలో చీరాల 1వ పట్టణం సిబ్బంది, శక్తీ టీం సభ్యులు పాల్గొన్నారు.