Home ప్రకాశం 104లో ఉద్యోగ అవకాశాలు : జోనల్ మేనేజర్ పిర్ల శివరాకేష్

104లో ఉద్యోగ అవకాశాలు : జోనల్ మేనేజర్ పిర్ల శివరాకేష్

178
0

చీరాల : ఎఇఎంఎస్ 104వాహనాల్లో డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు నిరుద్యోగ యువత అవకాశాలును సద్వినియోగం చేసుకోవాలని జోనల్ మేనేజర్ పిర్ల శివరాకేష్ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్, డ్రైవర్‌ ఉద్యోగానికి 10వ తరగతి పాసవడంతోపాటు హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ధరకాస్తులు చీరాల ఏరియా హాస్పటల్లో ప్రతి రోజు ఉదయం 09.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అభ్యర్థులు తమ బయోడేటా ఫామ్, ఒరిజినల్, జెరాక్స్ సెర్టిఫికేట్లు, బ్యాంక్ అకౌంట్, ఆధార్, 4ఫోటోలతో హాజరు కావలని కోరారు. ఈ నెల 20వరకు దరకాస్తులు తీసుకుంటున్నట్లు తెలిపారు. అరబిందో ఎయిమ్స్‌లో ఉద్యోగాల పేరుతో ఏఇఎంఎస్ పేరును దుర్వినియోగం చేస్తూ కొంతమంది వ్యక్తులు, ఏజెన్సీల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులను రిక్రూట్ చేయడానికి తాము ఎటువంటి నగదు చెల్లింపులు తీసుకోవటం లేదని, అలాంటి రిక్రూట్‌మెంట్ లేదా ఉద్యోగానికి సంబంధించిన ఏదైనా సమాచారాన్ని కలిగి ఉంటే hr@aurbindoems.com ఈ మెయిల్ ద్వారా తెలయజేయాలని కోరారు.