చీరాల : ఆర్టీసీ బస్టాండ్ వద్ద బాలాజీ కాంటీన్ షెడ్డులను మునిసిపల్ అధికారులు తొలగించారు. పోలీస్, మునిసిపల్ సిబ్బందితో ఉదయాన్నే బస్టాండ్ వద్ద జేసిబి, ట్రాక్టర్ల తో తొలగింపు పనులు చేపట్టడంతో ఏమి జరుగుతుందో తెలియక జనం ఆసక్తిగా చూశారు. నిత్యం జనంతో రద్దీగా ఉండే క్యాంటీన్ బోసిపోయి కనిపిస్తుంది.
ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై నుండి వచ్చే వాహనాలకు, బస్టాండ్ నుండి బయటికి వచ్చే వాహనాలకు క్యాంటీన్ వద్ద నిలిపిన వాహనాలు అడ్డంగా ఉంటుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో సెట్ బ్యాక్ స్థలంను పార్కింగ్ కు వదలాలి ఆర్టీసీ అధికారులకు, క్యాంటీన్ యజమానికి నోటీస్ ఇచ్చినట్లు టిపిఓ శ్రీనివాసరావు తెలిపారు. అందుకే సెట్ బ్యాక్ లో వేసిన షెడ్ ను తొలగించినట్లు తెలిపారు. ఎవరైనా రోడ్డు, పార్కింగ్ స్థలాలను ఆక్రమించి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించవద్దని సూచించారు.