Home ఆంధ్రప్రదేశ్ వరుస సెలవులతోపాటు… ఈనెల జీతాలూ ఆలస్యం?

వరుస సెలవులతోపాటు… ఈనెల జీతాలూ ఆలస్యం?

332
0

అమరావతి, ఆగస్టు 31 : ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాల చెల్లించే హెడ్ ఆఫ్ అకౌంట్లను మార్పు చేశారు. దీనితో అకౌంట్లు మ్యాపింగ్ చేయటంలోనూ చాలా ఆలస్యం అవుతుంది. అకారణంగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క జీతం బిల్లు కూడా సబ్మిట్ కాలేదు. సాధారణంగా ఉద్యోగుల జీత భత్యాలు ప్రతి నెలా 25లోపు సబ్మిట్ చేస్తుంటారు. కానీ నేటికీ ఒక్క బిల్లు కూడా సబ్మిట్ కాలేదు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం డీటీవో కార్యాలయంలో హెడ్ ఆఫ్ అకౌంట్స్ మ్యాపింగ్ పనులు శరవేగంగా చేస్తున్నారు.

డీడీవో రిక్వెస్ట్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అయితే సాధారణ సెలవులు కూడా వరుసగా రావడం వల్ల జీతం బిల్లు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం, రెండవ తేదీ వినాయక చవితి సాధారణం సెలవులు కావడంతో జీతాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.