Home బాపట్ల ఆలయ అభివృద్దికి కృషి

ఆలయ అభివృద్దికి కృషి

32
0

అద్దంకి (Addanki) : మండలంలోని సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం శృంగేరి పీఠాధిపతులైన శ్రీశ్రీ జగద్గురు విధిశేఖర భారతి స్వామిని హైదరాబాదు సైనికపురి నందుగల శృంగేరి మఠం నందు కలిసి ఆశీస్సులు తీసుకొన్నట్లు సహాయ కమిషనర్, ఇఒ మదమంచి తిమ్మానాయుడు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ చుండూరి మురళీ సుధాకరరావు, దేవస్థాన వేద పండితులు వంగల హరిశంకర అవధాని, ప్రధాన అర్చకులు కోటా లక్ష్మీనారాయణ, వేలమూరి శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. రాజగోపురం, ప్రకార మండపం పునర్నిర్మాణం, గోశాల అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ నుండి అనుమతి తీసుకున్నట్లు తెలిపారు.