Home ప్రకాశం డిఎస్సీ పోస్టుల సంఖ్య పెంచాలి : డివైఎఫ్ఐ

డిఎస్సీ పోస్టుల సంఖ్య పెంచాలి : డివైఎఫ్ఐ

633
0

చీరాల : డీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముంతావారి సెంటర్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్విహించారు. అనంతరం జరిగిన ధర్నా నుద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 23వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సుప్రీంకోర్టు కు ఇచ్చిన నివేదికలో ప్రభుత్వమే పేర్కొందన్నారు. కానీ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్ లో 7907 మాత్రమే ఇచ్చిందన్నారు.

ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. సిలబస్ రెవ్యూకు ఒక నెల వాయిదా వేయాలని కోరారు. ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి హాఫ్ లైన్ లొనే పరిక్ష నిర్వహించాలని కోరారు. ఎస్ఐ పోస్ట్ ల సంఖ్య 1600కు, కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య 6000కు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 2 పోస్టుల సంఖ్య 337 నుండి 2000లకు పెంచాలన్నారు. ధర్నాలో యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి జానీ బాషా మాట్లాడారు. కార్యక్రమంలో యూటిఎఫ్ నాయకులు గవిని నాగేశ్వరరావు, లింగం జయరాజ్, సిఐటియు కార్యదర్శి నలతోటి బాబురావు, డివైఎఫ్ఐ కార్యదర్శి పాదర్తి సాయిరాం, ఎస్ఎఫ్ఐ చీరాల అధ్యక్ష, కార్యదర్శులు బోస్, పూర్ణ నాయకులు చరిత, డిఎస్సి అభ్యర్థులు పాల్గోన్నారు.