Home బాపట్ల సెర్ప్‌ సహకారంతో లక్షపతి దీదీగా దుర్గాదేవి

సెర్ప్‌ సహకారంతో లక్షపతి దీదీగా దుర్గాదేవి

8
0

అమృతలూరు, మార్చి 09 (DN5 News) : బాపట్ల జిల్లా అమృతలూరు మండలం గోవాడ గ్రామానికి చెందిన మాథి దుర్గాదేవి (భర్త సాయిరాం) స్వయం సహాయక సంఘం సహకారంతో స్వయం ఉపాధిలో ముందుకు సాగుతూ లక్షపతి దీదీగా ఎదిగారు. గ్రామంలోని ‘సప్తగిరి’ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా చేరిన ఆమె మొదట రూ.5 వేల రుణంతో కుట్టు మిషన్ కొనుగోలు చేసి టైలరింగ్ పనులు ప్రారంభించారు. తరువాత ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతో రూ.50 వేల రుణం తీసుకుని బయో ఇన్‌పుట్ తయారీ ప్రారంభించారు.

రైతుల నుంచి మంచి ఆదరణ రావడంతో గ్రామ సంస్థ విఒ (Village Organization) నుంచి మరో రూ.1 లక్ష రుణం తీసుకుని బయో ఇన్‌పుట్, అవుట్‌పుట్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆమె సెంటర్ ద్వారా రైతులకు సేంద్రియ ఎరువులు అందించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి సహకరిస్తున్నారు. టైలరింగ్, బయో ఇన్‌పుట్ తయారీ, సెంటర్ నిర్వహణ ద్వారా ఏడాదికి రూ.1.50 లక్షల ఆదాయం పొందుతూ గ్రామంలోని మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. SERP (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) ద్వారా అందుతున్న సహకారం ఆమెను స్వయం ఉపాధిలో ముందుకు తీసుకువచ్చింది.