Home బాపట్ల డిఎస్‌పి మొయిన్‌ రక్తదానం

డిఎస్‌పి మొయిన్‌ రక్తదానం

16
0

• ఉత్సాహంగా పాల్గొన్న పోలీసు అధికారులు
• పోలీసు శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు
• విద్యార్థినులకు వైద్య పరీక్షలు
చీరాల (DN5 News) : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత వారోత్సవాలు పోలీసు యంత్రాంగం అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఎస్పీ బి ఉమామహేశ్వర్ (B Umamaheswar IPS) ఆదేశాల మేరకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం మంగళవారం ఏర్పాటు చేశారు. అత్యవసర సమయాల్లో మహిళలు, రోగులకు రక్తం అందుబాటులో ఉండాలనే మానవీయ దృక్పథంతో చేపట్టారు. దానితోపాటు పట్టణంలోని ఎస్‌సి హాస్టల్ విద్యార్థినులు, మహిళా పోలీసు సిబ్బందికి చర్చి కాంపౌండ్‌ కమ్యూనిటీ హాలులో ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయించారు.

ఈ రక్తదాన శిబిరంలో డీఎస్పీ ఎండి మోయిన్ (DSP Md.Moin) స్వయంగా రక్తదానం చేసి సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపారు. డీఎస్పీతో పాటు వన్ టౌన్ పోలీసు అధికారులు, సిబ్బంది, స్థానిక యువత, ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున స్పందించి సుమారు 50 మంది రక్తదానం చేశారు.

రక్తదాన శిబిరం (Blood Doanation) నిర్వహించడమే కాకుండా స్వయంగా రక్తదానం చేసిన డీఎస్పీని, ఇతర పోలీసు అధికారులను, సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చిన యువత, ఆటో డ్రైవర్లను ఎస్పీ అభినందించారు. సమాజ సేవలో పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. మహిళల ఆరోగ్యం, రక్షణ విషయంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఏవైనా అత్యవసర ఆపరేషన్లు, మహిళలకు కాన్పు సమయంలో రక్తం ఎంతో అవసరం అవుతుందన్నారు.

మన దేశంలో అవసరానికి సరిపడా రక్త నిల్వలు లేవని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. రక్తం దానం చేయడం ద్వారా మరొకరి ప్రాణాన్ని కాపాడవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చీరాల 1టౌన్ సిఐ ఎస్ సుబ్బారావు, ఎస్ఐ రాజ్యలక్ష్మి, వెంకటేశ్వరరెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ పవన్ కుమార్, శక్తి టీం సభ్యులు సుబ్బారావు పాల్గొన్నారు.