కొండేపి : స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా కొండపి, టంగుటూరు మండలాల ప్రత్యేక అధికారి, దిశ పోలీస్ స్టేషన్ జిల్లా డిఎస్‌పి ఎన్ ధనుంజయ కొండపిలో విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా టంగుటూరు మండలంలోని టంగుటూరు, పొందూరు, కందులూరు, కారమంచి, కొణిజేడు, కొండపి మండలంలోని కొండపి, అనకర్లపూడి,పెట్లూరు, పెద్ద కల్లగుంట గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో గ్రామస్థులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అల్లర్లు సృష్టించే వారిని ముందుగా గుర్తించి బైండోవర్ చేసి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే మద్యం అమ్మకం దారులు, బెల్టుషాపుల యజమానులను హెచ్చరించి, అటువంటి వారి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేసినా, వారివద్ద ఉన్న డబ్బులకు రసీదు లేకున్నా వారి వద్ద డబ్బులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. కావున ప్రజలు అన్నీ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు వారికి సహకరించవలసినదిగా కోరారు. సమావేశంలో సింగరాయకొండ సిఐ యు శ్రీనివాసులు, కొండపి ఎస్ఐ ఎన్ ప్రసాద్ పాల్గొన్నారు.