విజయవాడః టంగుటూరు రైల్వే స్టేషన్ లో తాగునీటి సౌకర్యం కల్పించాలని, మరుగుదొడ్లను వినియోగంలో తీసుకురావాలని డిఆర్‌యుసిసి సబ్యులు బొట్ల రామారావు కోరారు. విజయవాడలో జరిగిన డిఆర్‌యుసిసి జోనల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో మాట్లాడిన ఆయన స్టేషనలో సమస్యలను డిఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు. టంగుటూరు ర్వైల్వే గేటు వద్ద ఓవర్ బ్రడ్జి నిర్మాణం చేయాలని కోరారు. శిధిలావస్థలో ఉన్న స్టేషన్ భవనం స్థానంలో నూతన భవనం నిర్మించాలని కోరారు. ప్రయాణికులకు ప్లాట్‌ఫారంలపై షెల్టర్లు నిర్మించాలని కోరారు.
ఒంగోలు అగ్రహారం ఎల్‌సి గేటు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. సూరారెడ్డిపాలెం లెవెల్ క్రాస్ గేటువద్ద ఆర్ఒబి నిర్మించాలని కోరారు. సోమరాజుపల్లి వద్ద నిర్మించాలని మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి చేసిన ప్రతిపాదనను అమలు చేయాలని సూచించారు. శింగరాయకొండ స్టేషన్‌లో ఆర్ఒ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. చెన్నైనుండి నెల్లూరు వరకు వస్తున్న పాసింజర్ రైలును ఒంగోలు వరకు పొడిగించాలని కోరారు. ఉలవపాడు రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ది చేయాలని, ప్లాట్‌ఫారంల మద్య ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. కృష్ణ ఎక్స్‌ప్రెస్‌ను ఉలవపాడులో నిలపాలని కోరారు. ఉప్పుగుండూరు స్టేషన్‌లో పినాకినీ ఎక్స్‌ప్రెస్ ఆపాలని కోరారు. ఆర్ఒబిల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి తగిన సహకారం లభించకనే ప్రాజెక్టులు ముందుకు సాగడంలేదన్నారు.