Home ప్రకాశం రైల్యే ప్రయాణికుల సమస్యలపై 16న ప్రజావేదిక

రైల్యే ప్రయాణికుల సమస్యలపై 16న ప్రజావేదిక

324
0

టంగుటూరు : రైల్వే సమస్యలపై టంగుటూరులో ఈ నెల 16 ఆదివారం సమావేశం నిర్వహించనున్నట్లు డిఆర్యుసీసీ సభ్యులు బొట్ల రామారావు తెలిపారు. ఆదివారం సా. 4.30 ని.లకు “ప్రజా వేదిక” సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో రైల్వే ప్రయాణీకులు, మేధావులు, విశ్రాంత ఉద్యోగులు, నాయకులు, అభ్యుదయ వాదులు, ప్రజలు పాల్గొని టంగుటూరు స్టేషన్ లో ఉన్న రైల్వే సమస్యలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చిస్తున్నట్లు తెలిపారు. టంగుటూరు రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం చేసిన డిజైన్ గురించి విలువైన అభిప్రాయాలును తెలియజేయుటకు ఆహ్వానిస్తున్నట్లు బొట్ల రామారావు తెలిపారు.