Home ప్రకాశం వేసవిలొ త్రాగు నీటి వసతి కల్పించాలి

వేసవిలొ త్రాగు నీటి వసతి కల్పించాలి

96
0

పర్చూరు (Parchuru) : యద్దనపూడి (Yddanapudi) మండల సర్వసభ్య సమావేశం ఎంపిపి పి రజిని అధ్యకతన గురువారం నిర్వహించారు. సమావేశంలో ఎంపిడిఒ శివసుబ్రమణ్యం మాట్లాడుతూ రానున్న వేసవిలో గ్రామాల్లో తాగునీటి (Drinking Water) సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నీటి సమస్యలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామాల్లో సంక్షేమ పథకాలు  (Welfare) అర్హత ఉన్న వారందరికీ అందజేయాలని అన్నారు. ఎంఈఓ గోపి మాట్లాడుతూ మండలంలో 255 మంది విద్యార్థులకు టేబుళ్ళు పంపిణీ చేశామని చెప్పారు. కార్యక్రమంలో తహశీల్దారు నాగరాజు, ఎస్ఐ నాగ శ్రీను, ఎపిఎం వెంకట్రావు, పంచాయతీ రాజ్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.