చీరాల : డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీకి జన్మనిస్తే సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పునర్జన్మ ఇచ్చారని ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ యాదాల అశోక్‌బాబు అన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహనరెడ్డి లక్ష్యమని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా నాణ్యమైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి తెలిపారు.
చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం పొందుతున్న పేషెంట్లను పరామర్శించారు. అనంతరం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పోస్టర్‌ను ఆవిష్కరించారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్న శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ యాజమాన్యంను, వైద్య సిబ్బందిని అభినందించారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ కార్డు ఉన్నవారికి జనరల్, లాప్రోస్కోపీ ఆపరేషన్లు,హెర్నియా, ఎముకల ఆపరేషన్‌లు, కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి, చెవి, ముక్కు, గొంతు ఆపరేషన్‌లు ఉచితముగా చేస్తున్నట్లు తెలిపారు. చీరాలలో మొట్ట మొదటిసారిగా డయాలసిస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ శ్రావణ్ కుమార్‌రెడ్డి, ఎముకల స్పెషలిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య చౌదరి, జనరల్ సర్జన్ డాక్టర్ కాటూరి శ్యాంబాబు, డాక్టర్ నరేష్, హాస్పిటల్ జిఎం తాడివలస సురేష్, ఆరోగ్య మిత్ర అనిల్ పాల్గొన్నారు.