ప్రకాశం (దమ్ము) : సింగరాయకొండ మలినేని లక్ష్మయ్య కాలేజి కోవిడ్ కేర్ సెంటర్ లోని కరోనా బాధితులను పిడీసీసీ బ్యాంక్ చైర్మన్, వైస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ మాదాసి వెంకయ్య పరామర్శించారు. క్వారెంటైన్ లో వసతులు గురించి అడిగితెలుసుకున్నారు. వారికి అందజేసే బోజనాల నాణ్యతను పరిశీలించారు. అనంతరం కరోనా బాధితులకు తగు జాగ్రత్తలు చెప్పి, వారికి మనోధైర్యాన్ని నింపారు.