Home బాపట్ల పీజీ ఆర్ఎస్‌లో డాక్టర్ తాడివలస దేవరాజు పిర్యాదు

పీజీ ఆర్ఎస్‌లో డాక్టర్ తాడివలస దేవరాజు పిర్యాదు

131
0

బాపట్ల : స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తాడివలస దేవరాజు పిర్యాదు చేశారు. తన హాస్పిటల్‌ రెంట్ అగ్రిమెంట్ వివాదం చీరాల కోర్టులో ఉండగా భవన యజమాని బుర్ల వెంకటరావు తన రాజకీయ, ఆర్థిక, అంగ బలంతో హాస్పిటల్ ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తూ తనపై అధికారులకు పిర్యాదులు చేస్తూ మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారని పిర్యాదులో పేర్కొన్నారు. తన హాస్పిటల్‌పై తప్పుడు ప్రచారం చేస్తూ తనను నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని అధికారులకు వివరించారు. కోర్టు నిర్ణయం వచ్చేంతవరకు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందించుటకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, బుర్ల వెంకటరావు అతని బావ పమిడి భాస్కరరావు నుండి రక్షణ కల్పించాలని, అతని పిర్యాదుల ఆధారంగా అధికారుల వేధింపులు ఆపి తనకు రక్షణ కల్పించాలని కోరారు.