Home ప్రకాశం పేదలకు వైద్య సేవలందించే వైద్యులను సన్మానించడం రోటరీ బాధ్యత : రావి వెంకటరమణ, తాడివలస దేవరాజు

పేదలకు వైద్య సేవలందించే వైద్యులను సన్మానించడం రోటరీ బాధ్యత : రావి వెంకటరమణ, తాడివలస దేవరాజు

740
0

చీరాల : పేదల డాక్టర్ రిచ్చర్డ్ సన్ సాల్మన్ 73వ పుట్టిన రోజు సందర్భంగా చీరాల రోటరీ క్లబ్ క్షీరపురి ఆధ్వర్యంలో డాక్టర్ సాల్మన్ చే పేదలకు దుప్పట్ల పంపిణీ చేశారు. వైద్యరంగంలో పేదలకు సేవలందించిన డాక్టర్ ను సన్మానించారు. పుట్టినరోజు వేడుకలు జరిపారు.

ఈ కార్యక్రమంలో చీరాల ఐఎంఏ ప్రెసిడెంట్, సెక్రటరీ డాక్టర్ పివి ప్రసాద్, డాక్టర్ పున్నారవు మాట్లాడుతూ ఈతరం యువ వైద్య నిపుణులు డాక్టర్ సాల్మన్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పేదలకి ఏ విధంగా వైద్య సేవలు అందించాలనే అంశంలో ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ప్రజా అభిమానాన్ని ఎలా పొందాలన్న విషయాలను డాక్టర్ సాల్మన్ నుండి తెలుసుకోవాల్సిన బాధ్యత యువ వైద్యులపై ఉందని తెలియజేశారు.

రోటరీ క్లబ్ ఆఫ్ క్షిరపురి అధ్యక్ష, కార్యదర్శి రావి రమణ, తాడివలస దేవరాజు మాట్లాడుతూ పేదలకి వైద్య సేవ చేసేటటువంటి మనసున్న మంచి వైద్యులు డాక్టర్ రిచర్డ్ సన్ సాల్మన్ అని తెలిపారు. కార్యక్రమంలో చిమట ఉమామహేశ్వరరావు, ఆకురాతి రేవంత్, సతీష్, స్వాములు, శ్యామ్, ఇమ్మానియేల్, సాంబశివరావు పాల్గొన్నారు.