చీరాల : మున్సిపల్ పరిధిలో ఉన్న తోపుల బండ్ల వ్యాపారుల సమస్యలపై చీరాల మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు కలిశారు. తోపుడు బళ్ల వారికి పేరాల మార్కెట్ నుండి చీరాల వరకు రోడ్డు పక్కన మార్జిన్ లో బండ్లు పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మున్సిపల్ కమిషనర్ అధికారులతో మాట్లాడి అవకాశం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మించాలా సాంబశివరావు, బొనిగల జైసన్ బాబు, దేవరపల్లి బాబురావు, నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.