చీరాల (Chirala) : తెలుగుదేశం నియోజకవర్గ అధికార ప్రతినిధి డాక్టర్ మద్దులూరి మహేంద్రనాధ్ పుట్టినరోజు వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. కుటుంబ సభ్యులైన సినీ హీరో నిఖిల్ హాజరై సందడి చేశారు. శాసన సభ్యులు ఎంఎం కొండయ్య తనయుడైన మహేంద్రనాధ్‌కు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయం నుండి భారీ ర్యాలీ డిమార్డ్, నల్లగాంధీ బొమ్మ సెంటర్, ముంతవారి సెంటర్, మున్సిపల్ ఆఫీస్, బస్టాండ్ వరకు సాగింది. ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల అర్పించి ఘన నివాళులు తెలిపారు. గడియార స్తంభం సెంటర్‌లో గజమాలతో మహేంద్రనాధ్‌ను అభిమానులు ఘనంగా సత్కరించారు. బాణసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టారు.
పట్టణంలోని పలు దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు చేశారు. సేవా కార్యక్రమాలు, అన్నదానం చేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, ఎఎంసి చైర్మన్ కౌతరపు జనార్ధన్, టిడిపి పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్, తెలుగు యువత అధ్యక్షులు దోగుపర్తి బాల కృష్ణ పాల్గొన్నారు. తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలకు డాక్టర్ మహేంద్ర నాధ్ ధన్యవాదాలు తెలిపారు. చీరాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. టిడిపి కంచుకోటగా ఉండే చీరాలలో రానున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని టీడీపీ జెండా రెప రెపలాడెలా చేయాలని కోరారు.






