టంగుటూరు : రెండు నెలలు కష్టపడితే ఐదేళ్లు బాగుంటామని వైయస్సార్సీపి కొండేపి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య కార్యకర్తలతో అన్నారు. కొండేపి రోడ్డులోని వైసిపి కార్యాలయంలో జరిగిన మండల స్థాయి బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశంలోఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాధలన్నీ తీరిపోతాయన్నారు. కార్యకర్తలు అందరూ బాగుంటారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో గెలవకపోతే ఇబ్బందులును ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. ఎన్ని పనులున్నా పార్టీ గెలుపుకోసం సమయం కేటాయించాల్సి ఉందన్నారు. నూటికి నూరుపాళ్లు అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ పార్టీయే అన్నారు. గ్రామాల్లోని ఇంటింటికి వెళ్లి ఓట్లు లేని వారిని గుర్తించి, ఓట్లు చేర్పించాలన్నారు. ఈ సందర్భంగా వెలగపూడి మాజీ సర్పంచ్ డోలా చెన్నకేశవులుకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈకార్యక్రమంలో వైసిపి జిల్లా నాయకులు బొట్ల రామారావు, మాజీ జెడ్పిటిసి రావూరి అయ్యవారయ్య, పార్టీ మండల అధ్యక్షులు సూదన గుంట శ్రీహరి, వల్లూరు దేవాలయ మాజీ చైర్మన్ సూరం రమణారెడ్డి, మాజీ సర్పంచులు పుట్టా వెంకట్రావు, చిట్నీడి రంగారావు, సూదనగుంట నారాయణ, అద్దంకి శేషయ్య, ఎంపిటిసి బ్రాహ్మణకాక వేణు, కుందం హనుమారెడ్డి, జయరాంరెడ్డి, సుంకర బ్రహ్మారెడ్డి, వి రోసిబాబు, రావెళ్ల ప్రదీప్, కొమ్ము రమేష్ పాల్గొన్నారు.