Home ప్రకాశం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే మూడు రాజధానులు : డాక్టర్ మాదాసి వెంకయ్య

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే మూడు రాజధానులు : డాక్టర్ మాదాసి వెంకయ్య

423
0

టంగుటూరు : మూడు రాజధానులతొ అధికార వికేంద్రీకరణకు గవర్నర్ హరిచందన విశ్వభూషణ్ రాజముద్ర వేయడం రాష్ట్ర చరిత్రలో మంచిరోజని వైసీపీ కొండపి నియోజకవర్గ ఇంచార్జి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య అన్నారు. ఈ సందర్భంగా నాలుగు రోడ్ల కూడలిలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ వెంకయ్య మాట్లాడుతూ ఇంతకుముందు రాష్ట్రం పడుతున్న బాధలను గమనించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, జిల్లాలు సమగ్ర అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో అధికార వికేంద్రీకరణ కు మూడు రాజధానులు చేయాలనే ప్రతిపాదన చేశారన్నారు. దానికి చంద్రబాబు ఎన్నో అడ్డంకులు సృష్టించాడన్నారు. ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రలోని డబ్బులన్నీ తీసుకుపోయి చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలు హైదరాబాద్ లో పోసారన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చేయడం వల్ల మిగతా ప్రాంతాలలో అభివృద్ధి కుంటుపడడం జరిగిందన్నారు.

రాయలసీమ ఏడు దశాబ్దాలుగా కరువు ప్రాంతంగానే ఉంటుందని, అన్నీ ప్రాంతాలు అభివృద్ధి జరగాలనే ఉద్దేశ్యంతో సిఆర్డిఎ రద్దు, అధికార వికేంద్రీకరణ బిల్లులపై గవర్నర్ రాజ ముద్ర వేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్ లోలా ఒకే చోట నిధులు కేటాయించకుండా అమరావతిని అసెంబ్లీ రాజధానిగా, కర్నూలు న్యాయవ్యవస్థ రాజధానిగా, విశాఖపట్నం అడ్మినిస్ట్రేషన్ రాజధానిగా చేసి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఇప్పటికీ అమరావతి రాజధాని కావాలని చంద్రబాబు నాయుడు పదేపదే మాట్లాడడం ఆయన స్వార్థపూరిత రాజకీయాల కోసమే తప్ప ప్రజల అభివృద్ధి ఆయనకు అవసరం లేదని అన్నారు.

వైసీపీ మండల అధ్యక్షులు సూదనగుంట శ్రీహరిబాబు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో టంగుటూరు సొసైటీ అధ్యక్షులు రావూరి అయ్యవారయ్య, వల్లూరు దేవస్థానం మాజీ చైర్మన్ సూరం రమణారెడ్డి, వైసీపీ జిల్లా ప్రధానకార్యదర్శి లింగంగుంట రవిబాబు, డేవిడ్, జిల్లా అధికార ప్రతినిధి బొట్ల రామారావు, మహిళా నాయకురాలు బొడ్డపాటి అరుణ, కోటిరెడ్డి, దాసరి సుబ్బారావు, ఏక ప్రభాకర్, శారీమందిర్, మట్టిగుంట సురేష్, కురుగుంట్ల జాన్ బాబు, ఆశీర్వాదం, ప్రభుదాస్, క్రాంతి, ఆనంద్ పాల్గొన్నారు.