ఒంగోలు : అందరు నిత్య విద్యార్థులుగా ఉండాలని మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం చెప్పినట్లు ప్రతి ఒక్కరు సాంకేతికతను ఉపయోగించుకుంటూ జ్ఞానాన్ని పెంచుకోవాలని, వైద్య వృత్తిలో సేవా భావం అనేది చాలా ముఖ్యమని ఒంగోలు ఎస్‌వి ఫిజియోథెరపీ కాలేజీ కరస్పాండెంట్ సంజీవరెడ్డి, ప్రిన్సిపాల్ సుధాకర్, ఆంజనేయ ప్రసాద్ పేర్కొన్నారు. 2019-24బాచ్ ఫిజియోథెరపి ఉత్తీర్ణులకు పట్టాలను అందజేసేందుకు ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. వైద్య వృత్తిలో వచ్చే ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే విధంగా నిరంతరం అధ్యయనం ఉండాలని సూచించారు. తద్వారా మెరుగైన సేవలు అందించవచ్చని అన్నారు. పేదలు, సాధారణ ప్రజలకు సేవాదృక్పధంతో వైద్య సేవలు అందించాలని చెప్పారు.
డాక్టర్ తాడివలస దేవరాజు, డాక్టర్ పంబ నరేష్ కుమార్, తేజరెడ్డీ తదితరులు ఫిజియోథెరపీ డాక్టర్ డిగ్రీని అందించకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల ఆటల పోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌వి కాలేజ్ చైర్మన్ సుబ్బలక్ష్మి, బి రాజేష్, బేర్ ఆరుణ్, రేష్మ, ఎఓ రిచర్డ్స్ దేవరాజు, ఎస్‌వి కాలేజ్, ఆర్‌పిఆర్ కాలేజ్ అధ్యాపకులు, ఫిజియోథెరపీ విద్యార్థులు పాల్గొన్నారు.