Home ఆంధ్రప్రదేశ్ పివి నరసింహారావు గుర్తుకురాలేదా : కోన రఘుపతి

పివి నరసింహారావు గుర్తుకురాలేదా : కోన రఘుపతి

12
0

బాపట్ల (Bapatla): మాజీ ప్రధాని అటల్ బిహారివాజ్ పేయి (Atal Bihari Wajpeyee) విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అట్ట హాసం చేసిన నాయకులకు మన రాష్ట్రానికి చెందిన తొలి తెలుగు ప్రధాని పివి నరసింహారావు (PV Narasimharao) గుర్తుకు రాకపోవటం బాధకరమని మాజీ శాసన సభ్యులు కోన రఘుపతి (Ex.MLA Kona Raghupati) అన్నారు. స్థానిక వైసిపి (YSRCP) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతనంగా విగ్రహాల ఏర్పాటుపై ఉన్నంత శ్రద్ధ పట్టణంలో రహదారి విస్తరణలో తొలగించి పక్కన పెట్టిన విగ్రహాల ఏర్పాటుపై లేదన్నారు. ప్రజాకవి గుర్రం జాషువా, అమరజీవి పొట్టి శ్రీరాములు, కోన ప్రభాకరరావు, ఎన్జీఆర్ విగ్రహాల గురించి పట్టించుకోని అధికార యంత్రాంగం ఆఘమేఘాలపై వాజ్‌పేయి విగ్రహానికి అనుమతి ఏవిధంగా ఇచ్చారని అన్నారు. అనుమతి ఇవ్వకపోతే నిర్మాణం జరుగుతుంటే ఏమి చేశారని ప్రశ్నించారు.

వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటు చేసిన స్థలం జాతీయ రహదారి నిర్మాణంలో మిగిలిన సొసైటీ భూమని గుర్తు చేశారు. ఈవిషయంపై సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇప్పటికైనా స్పందించి మూలబడి మగ్గుతున్న తొలగించిన విగ్రహాలను తక్షణమే ఆయా ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సోమవారం జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విరమించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో వైసిపి మండల అధ్యక్షులు మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, యువజనవిభాగం రాష్ట్ర కార్యదర్శి నక్కా వీరారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, ఇనగలూరి మాల్యాద్రి, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, చల్లా రామయ్య, జోగి రాజా, అడే చందు, మోర్ల సముద్రాల గౌడ్, రెడ్డి అంకయ్య, మచ్చా శ్రీనివాసరెడ్డి, అనిల్ కుమార్ పాల్గొన్నారు.