Home బాపట్ల స్వ గ్రామ అభివృద్ధికి రూ.కోటి విరాళం

స్వ గ్రామ అభివృద్ధికి రూ.కోటి విరాళం

9
0

బాపట్ల (కర్లపాలెం) (DN5 News) : మండలంలోని యాజిలి గ్రామానికి చెందిన గుండ్రెడ్డి సత్యనారాయణ స్వగ్రామ అభివృద్ధికి పెద్దమనసుతో ముందుకొచ్చారు. గ్రామ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వానికి రూ.1 కోటి విరాళం అందజేరు. పీ4 పథకం కింద ఈ మొత్తానికి సంబంధించిన చెక్కు సిఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు. సూరేపల్లిలో నిర్వహించిన ‘మీ భూమి, మీ హక్కు’ కార్యక్రమంలో సిఎంను కలిసి చెక్కు అందించారు. ఈ సందర్భంగా ఆయన సేవాభావాన్ని సిఎం ప్రశంసించారు. స్వగ్రామ అభివృద్ధికి రూ.కోటి విరాళంగా ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఇటువంటి చొరవలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని సిఎం పేర్కొన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో ఈ ఘటన చాటి చెప్పిందని అన్నారు. స్థానిక ప్రజలు సత్యనారాయణను అభినందించారు. ఆయన చూపిన మార్గంలో మరింత మంది ముందుకు రావాలని ఆకాంక్షించారు.