Home ప్రకాశం గ్రామానికి ఎసి మార్చురీ బహుకరణ

గ్రామానికి ఎసి మార్చురీ బహుకరణ

559
0

టంగుటూరు : మండలం ఎం.నిడమనూరు మాజీ ఉప సర్పంచ్ కాకుమాని శ్రీకాంత్ నాయనమ్మ కాకుమాని నారాయనమ్మ పేదకర్మ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

కొండపి, కందుకూరు శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, పోతుల రామారావు, మాజీ శాసనసభ్యులు కసుకుర్తి ఆదెన్న, సినీనటులు తొట్టెంపూడి వేణు, ఒంగోలు డిఎస్పీ రాజేష్ మురళి, ఎఎంసి చైర్మన్ రామయ్య చౌదరి, టంగుటూరు మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు, టీడీపీ మండల అధ్యక్షులు కామని విజయ కుమార్, మర్లపాడు ఎంపీటీసీ హరిబాబు, టీడీపీ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, పిడుగురాళ్ల సురేష్, ఈదర ప్రభాకర్, కాట్రగడ్డ అనిల్, శ్రీరామ్మూర్తి, మొలకలపల్లి శ్రీను, బొజ్జా శ్రీను, బ్రహ్మానందం, రమణారెడ్డి, జరుగుమల్లి ఎంపీపీ భర్త పెదబాబు తదితరులు నివాళులు అర్పించారు.


ఈ సందర్భంగా శ్రీకాంత్ కుటుంబ సభ్యులు స్వర్గీయ కాకుమాని చినకోటయ్య, నారాయనమ్మ జ్ఞాపకార్థం మృతదేహం భద్రపరిచే ఫ్రీజర్ ను పంచాయతీకి బహూకరించారు.