Home క్రైమ్ వైద్యుని కుటుంభం ఆత్మహత్య

వైద్యుని కుటుంభం ఆత్మహత్య

369
0

తూర్పుగోదావరి: అమలాపురంలో ప్రముఖ ఎముకల వైద్యుడు డాక్టర్ రామకృష్ణంరాజు కుటుంభం ఆత్మహత్య చేసుకున్నారు. అమలాపురంలో కృష్ణా ఆర్ధోపెడిక్ ఆసుపత్రిని నిర్వహిస్తున్న వైద్యుడు పెనుమత్స రామకృష్ణంరాజు(55), ఆయన భార్య లక్ష్మిదేవి(45), కుమారుడు కృష్ణ సందీప్(25) ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. కృష్ణ సందీప్ పెద్దకుమారుడు. ఇతను ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అమలాపురంలోని స్వగృహంలో వీరు విగతజీవులై పడి ఉండగా శుక్రవారం ఉదయం ఆసుపత్రి సిబ్బంది గమనించారు. పోలీసులు సంఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు.