చీరాల (Chirala) : మాజీ ఎంఎల్‌ఎ కరణం బలరామకృష్ణ మూర్తి, వైసిపి ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో వైసిపి మేధావుల సంఘం అధ్యక్షుడు తేళ్ల రాంబాబు మండలంలోని తోటవారిపాలెం స్ట్రెయిట్ కట్ మీద ఉన్న మహిళలతో కలసి క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం వృద్ధులకు బ్రెడ్లు పంపిణీ చేశారు. క్రిస్మస్ అంటే ప్రేమ, సంతోషం, ఒకరినొకరు ప్రేమతో పలకరించుకోవడమని తెలిపారు.






