Home బాపట్ల విద్యార్ధులకు బహుమతులు పంపిణీ

విద్యార్ధులకు బహుమతులు పంపిణీ

51
0

చీరాల (Chirala) : స్థానిక రోటరీ సామాజిక భవనంలో రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో 8 రోజులుగా నిర్వహించిన యువజన వారోత్సవాలు ఆహ్లాదకరంగా ముగిశాయి. ఈ సందర్భంగా రోటరీ (RotaryClub) పిడిజి రొటేరియన్ పి శివన్నారాయణ, అసిస్టెంట్ గవర్నర్ నాగభైరు శ్రీనివాసరావు చేతుల మీదుగా విజేతలు, ఆర్గనైజర్స్‌కు జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు సోమవారం అందజేశారు. ప్రపంచంలో 36 వేల రోటరీ క్లబ్లు, 12 లక్షల మంది సభ్యులున్న ఏకైక సంస్థ రోటరీ అన్నారు. పోలియో వ్యాధి నిర్మూలనకు రూ.వేల కోట్లు సొంత నిధులు ఖర్చు చేసి ప్రపంచం నుండి పోలియో వ్యాధిని పారదోలిన ఘనత రోటరీకే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో గీతా ట్రస్ట్‌ ఛైర్మన్‌ వలివేటి మురళీకృష్ణ, జాలాది కృష్ణమూర్తి, తిరుమలశెట్టి లక్ష్మీ ప్రతాప్, పోలుదాసు రామకృష్ణ, శివాంజనేయ ప్రసాద్, ముద్దన రఘుకుమార్, భానుకుమారి, సుభాషిణి, గుర్రం రాఘవరావు, ఎంవి రామారావు, ఎస్‌వి స్వామి, జివై ప్రసాద్, ఎం శ్రీనివాసరావు, వీరాంజనేయులు పాల్గొన్నారు.