Home బాపట్ల విద్యార్థులకు అట్టలు, పెన్నులు పంపిణీ

విద్యార్థులకు అట్టలు, పెన్నులు పంపిణీ

8
0

చీరాల (DN5 News) : ఎంపీ తెనేటి కృష్ణప్రసాద్ జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలో సోమవారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో రాఘవేంద్ర స్కూల్ ప్రిన్సిపాల్‌ గవిని మణికుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థినులకు పరీక్షల కోసం అవసరమైన అట్టలు, పెన్నులు, పెన్సిళ్లు, జ్యామింట్రి బాక్సులు పంపిణీ చేశారు. బాలికలు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని అన్నారు. మంచి ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు గౌరవం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో మెరిచర్ల స్వామిదాసు, సత్యప్రసాద్, ఖాలీబ్, రమేష్, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.