మర్రిపూడి : కాకర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా 2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో పాఠశాల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్బూరి ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాకర్ల సర్పంచ్ మేళం శివన్నారాయణ, పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ షేక్ హిమాంబాషా పాల్గొని విద్యార్ధులను అభినందించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను ఉపయోగించుకొని చక్కగా చదువుకొని భవిష్యత్తులో ఉన్న స్థానాలు అందుకోవాలని కోరారు. గ్రామ సర్పంచి మేళం శివన్నారాయణ మాట్లాడుతూ అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, నాడు-నేడు వంటి కార్యక్రమాలు అమలు చేస్తూ పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బహుమతులు పొందిన విద్యార్థులకు అభినందించారు. వరుసగా రూ.3వేలు, రూ.2వేలు, రూ.వెయ్యి నగదుతోపాటు మెడల్, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకర్ల సచివాలయ అధ్యక్షులు వెంగల్‌రెడ్డి, బోయపాటి కృష్ణారెడ్డి, కృష్ణ, గ్రామ పెద్దలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.