చీరాల (DN5 News) : స్థానిక రోటరీ భవనంలో రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్‌వి రాం ప్రసాద్ చేతుల మీదుగా రూ.8వేల విలువైన నిత్యావసర వస్తువులు ముగ్గురికి, న్యాయవాది బి హేమంత్ కుమార్ ఆర్ధిక సహాకారంతో కొమ్ము యామిని అనే విద్యార్థిని చదువుకు రూ.12వేల ఆర్ధిక సహాయం సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ గవర్నర్ రాంప్రసాద్ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవని, పేదలకు సేవచేయడమే రోటరీ ధ్యేయమని అన్నారు.
చీరాల రోటరీ క్లబ్ 73ఏళ్ల నుండి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుందని అన్నారు. ఇంకా కొత్త సభ్యులను చేర్చుకోవాలని అన్నారు. అసిస్టెంట్ గవర్నర్ నాగభైరు శ్రీనివాసరావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ అంతర్జాతీయంగా పోలియో నిర్మూలనకు రూ.25వేల కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్ మినహా ప్రపంచం నుండి పోలియోను పారదోలిన ఘనత రోటరీకే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో రోటరీ ప్రెసిడెంట్ జాలాది కృష్ణమూర్తి, సెక్రెటరీ తిరుమలశెట్టి లక్ష్మీ ప్రతాప్, కోశాధికారి పోలుదాసు రామకృష్ణ, వలివేటి మురళీకృష్ణ, పుల్లయ్యనాయుడు, డాక్టర్ ఐ బాబూరావు, సుభాషిణి, గుర్రం రాఘవరావు, ప్రసాద్, డాక్టర్ నాగేశ్వరరావు, వీరాంజనేయులు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.






