Home బాపట్ల నిత్యవసర సరుకులు పంపిణీ

నిత్యవసర సరుకులు పంపిణీ

34
0

రేపల్లె (Repalle) : తుఫాను కారణంగా నష్టాన్ని గుర్తించి ఒక్కొక్క కుటుంబానికి 25కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, బంగాళ దుంపలు వంటి సరుకులు మండలంలోని రావి అనంతవరంలో తహశీల్దారు మోర్ల శ్రీనివాసరావు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు (Chandrababu) నిర్దేశించిన విధంగా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులు, పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి అందిస్తున్నట్లు తెలిపారు.

నిజాంపట్నం (Nijampatnam) : తీరప్రాంత మత్స్యకార కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులను నిజాంపట్నంలోని రేషన్ షాపుల్లో జడ్పిటిసి నర్రా సుబ్బయ్య (ZPTC Narra Brahmaiah) సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడుతూ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satyaprasad), టీడీపీ సీనియర్ నేత అనగాని శివప్రసాద్ ఆదేశాల మేరకు పేద కుటుంబాలు నష్టపోకూడదనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఆదుకుటుందని అన్నారు. నిత్యవసరకులు అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బొమ్మిడి రామకృష్ణ, టీడీపీ పట్టణ అధ్యక్షులు ఖాదర్ బాబు, సొసైటీ డైరెక్టర్ లంకె మీరయ్య, టీడీపీ నాయకులు కన్నా మీరయ్య, నాయుడు నరసింహామూర్తి పాల్గొన్నారు.