చీరాల (Chirala) : ఐక్య క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య (MLA Kondaiah) పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. స్థానిక గడియార స్తంభం సెంటర్‌లో పాస్టర్స్ అసోసియేషన్, ఇవాంజలిస్ట్‌ల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ (Xmas) శుభాకాంక్షలు తెలిపారు. గత 25ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఆటోనగర్ ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. చేనేత టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి జరుగుతోందన్నారు. వెనుకబడిన తరగతులన్నీ అభివృద్ధి చెందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం ఎమ్మెల్యే కొండయ్యను పాస్టర్లు సన్మానించారు. కార్యక్రమంలో రాజా సిల్వన్, పి ఎలీషారెడ్డి, రత్నరాజు, గారపాటి పుష్పరాజ్, దేవరపల్లి రంగారావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్, కౌన్సిలర్ సలూరి సత్యానందం, డేటా నాగేశ్వరావు, డానియేలు ప్రసాద్ పాల్గొన్నారు.






