Home బాపట్ల మహిళలకు రుణాలు పంపిణీ

మహిళలకు రుణాలు పంపిణీ

17
0

చిన్నగంజాం (DN5 News) : మహిళల సంక్షేమం, సాధికారతలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రధమ స్థానంలో నిలుస్తోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. మహిళలు ఆర్థికంగా బలపర్చే దిశగా సిఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తోందని అన్నారు. స్థానిక జెడ్‌పి హైస్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తెలుగుదేశం ఎన్‌టిఆర్‌ కల్పించారని చెప్పారు. పొదుపు సంఘాల మహిళల రుణ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినట్లు తెలిపారు. తెలిపారు. డిఆర్డిఏ ఆధ్వర్యంలో మండలంలోని పొదుపు సంఘాల మహిళలకు రూ.150 కోట్ల రుణాలు విడుదల చేస్తూ చెక్కు అందజేశారు. ఐసిడిఎస్ డిఆర్డిఏ స్టాల్స్ అందరిని ఆకట్టుకున్నాయి. డిఆర్డిఎ సహకారంతో కార్లు, టెంట్ సామాగ్రి, డీజే మైక్ సెట్టింట్లను అందజేశారు. కార్యక్రమంలో పర్చూరు ఎఎంసి చైర్మన్ గుంజి వెంకట్రావు, టిడిపి మండల అధ్యక్షులు పోద వీరయ్య, నాయుడు హనుమంతరావు, బాపట్ల పార్లమెంటు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నక్కల రాఘవ, అధికార ప్రతినిధి ఆజాద్, ప్రత్యేక అధికారి లవన్న, ఐసిడిఎస్ సిడిపిఓలు సులోచన, సుభద్ర, ఎపిఎం అనురాధ, సుబ్బారావు, రామకృష్ణ, మోహనరావు, పిఎసిఎస్ అధ్యక్షులు బత్తుల శ్రీనివాసరావు, యార్లగడ్డ లక్ష్మి, చిన్నగంజాం సర్పంచి రాయని ఆత్మరావు పాల్గొన్నారు.