Home బాపట్ల ఆర్థిక విప్లవం దిశగా దివ్యాంగుల గ్రూపులు : ఎమ్మెల్యే ఏలూరి

ఆర్థిక విప్లవం దిశగా దివ్యాంగుల గ్రూపులు : ఎమ్మెల్యే ఏలూరి

15
0

చిన్నగంజాం (Chinaganjam) : మహిళా సంఘాల స్ఫూర్తితో దివ్యాంగుల గ్రూపులు కూడా స్వయం ఉపాధి సంఘాలను బలోపేతం చేసుకుని ఆర్థిక వృద్ది సాధించడం అభినందనీయమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (MLA Yeluri Sambashivarao) పేర్కొన్నారు. ప్రపంచ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. దివ్యాంగులకు ప్రత్యేక మద్దతు, రుణాలు, శిక్షణలు, ఉపాధి అవకాశాలు విస్తృతంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అననారు.

తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశం ఉపాధి, విద్య, ఆరోగ్యం, పింఛన్ల పెంపు, నైపుణ్యాభివృద్ధికి వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా చేతి కర్రలు, నడుం బెల్టులు, వీల్ చైర్లు, మెడ పట్టీలు, మోకాలు పట్టీలు, రైల్వే పాసులు, నిత్యవసర సరుకుల కిట్లు, స్వయం ఉపాధి కోసం 10 మంది లబ్ధిదారులకు రూ.20 లక్షల విలువైన రుణాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్, ఎఎంసి చైర్మన్ గుంజి వెంకట్రావు, నాయుడు హనుమంతరావు, ఆజాద్, చిన్న, సుబ్బారెడ్డి, భాస్కరరెడ్డి, కొండలు, లక్ష్మి, సంధ్య, రామాంజనేయులు, సత్యం, సందు శీను పాల్గొన్నారు.