Home ప్రకాశం పరిష్కరించకుంటే ప్రతిఘటన తప్పదు : వ్య.కా.స

పరిష్కరించకుంటే ప్రతిఘటన తప్పదు : వ్య.కా.స

396
0

హనుమంతునిపాడు : ఆన్లైన్లో అక్రమాలు చోటు చేసుకున్నామని, అర్హులైన పేదలకు సాగు భూములు, నివేశన స్థలాలు ఇవ్వాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట వంటావార్పుకు సిద్ధమయ్యారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు కదిలేదిలేదని పేదలు ప్రకటించారు.

మంగళవారం ఉదయం నుండి తహశీల్దార్ కార్యాలయం ఎదుట కూర్చున్నారు. పేదల ఆందోళన ను భగ్నం చేసేందుకు తహశీల్దార్ ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్యని నాయకులు బడుగు వెంకటేశ్వర్లు ఆరోపించారు. సమస్య పరిష్కారం చేయకుండా ఆందోళన కారులు టెంట్లు, మైకు, వంట సామాన్లు అద్దెకు ఇచ్చిన వారిని బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. తమపై నిర్బంధం ప్రయోగిస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.

కందుకూరు ఆర్డీఓ హామీతో ఆందోళన విరమించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ తో చర్చించి సమస్య పరిష్కారం చేస్తామని ఫోన్లో ఆందోళనకారులతో మాట్లాడి హామీ ఇచ్చినట్లు పోరాట కమిటీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు ఎన్ రాములు, మల్లెల కొండయ్య, నాగమణి, కాంతమ్మ, భూపోరాట కమిటీ నాయకులు యిర్మీయా, ఏసేబు, ఏబు, దేవయ్య, తిరుపాలు పాల్గొన్నారు.