– నాయిబ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి
– ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధికి కృషిచేయాలి
ఒంగోలు : ఏ వన్ ఫంక్షన్ హల్ లో 139కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ముఖ్య మంత్రి జగన్ మోహనరెడ్డి కృతజ్ఞత సభ నిర్వహించారు. సభలో ప్రకాశం జిల్లా నుండి నాయిబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా నూతనంగా ఎన్నికైన ధరణికోట లక్ష్మి నారాయణను చీరాల నాయిబ్రాహ్మణ సంఘం సభ్యులు, తాడివలస దేవరాజు గజమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా తాడివలస దేవరాజు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించేందుకు ధరణికోట ముందుండాలని కోరారు. ఆర్థికగా, సామాజిక అభివృద్ధి చెందేందుకు కృషిచేయాలని కోరారు. మరిన్ని ఉన్నత పదవులు పొందాలని అన్నారు.
కార్యక్రమంలో చీరాల నాయిబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు మాచవరపు వెంకటేశ్వర్లు, కోశాధికారి మేడిశెట్టి సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ వల్లూరి వెంకట సుబ్బారావు, చావెళ్లి నటరాజు, యమర్తి అంజిబాబు పాల్గొన్నారు.