Home బాపట్ల శింగరకొండ తిరునాళ్లకు పోటెత్తిన భక్త జనం

శింగరకొండ తిరునాళ్లకు పోటెత్తిన భక్త జనం

5
0

అద్దంకి (DN5 News) : శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి 71వ వార్షిక తిరునాళ్ల మహోత్సవంలో సోమవారం ఉదయం నుండి భక్తులు భారీ సంఖ్యలో క్యూ లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. ఎస్‌పి విష్ణువర్ధన్ రాజు (SP VishnivardhanRaju IPS) స్వామివారిని దర్శించుకుని వేదపండితుల ఆశీర్వాద పొందారు. అనంతరం తిరుణాలలో బందోబస్తు గురించి డిఎస్‌పి బి లక్ష్మీనారాయణ, సిఐలు ఆరాధ్యుల సుబ్బరాజు, మల్లికార్జునరావుతో చర్చించారు.

దేవస్థానం ఇఒ మదమంచి తిమ్మనాయుడు ఎస్‌పికి సాదర స్వాగతం పలికారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నియంత్రించి స్వామి వారి దర్శనం చేయించే విధంగా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తిరుణాలలో మద్యం అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అన్నారు. మద్యం సేవించి అల్లర్లు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల నిఘాతో తిరునాళ్లలో అవాంఛనీయ సంఘటన జరగకుండా దృష్టి సారించాలని అన్నారు. కార్యక్రమంలో దేవస్థానం పాలక మండల సభ్యులు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.