Home బాపట్ల అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం : ఏలూరి

అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం : ఏలూరి

52
0

పర్చూరు (parchuru) : కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ (ntr) భరోసా పింఛన్లు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు(mla yeluri samba shivarao) పేర్కొన్నారు. మంగళవారం మార్టూరు మండలం ఇసుక దర్శి గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్లను పంపిణీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందించారు. ఎమ్మెల్యే ఏలూరితో పాటు ప్రముఖ పారిశ్రామిక వేత్త విక్రమ్ నారాయణతో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు. కొద్దిసేపు వారితో ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతినెల పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వృద్ధులకు ఎన్టీఆర్ పెన్షన్లు భరోసాగా నిలుస్తున్నాయని ఆన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని పెంచడంతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అంతకు ముందు రెండు నెలల పింఛన్ బ్యాలెన్స్ ను కూడా కలిపి అందజేశామని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.