చీరాల : చలికాలం ప్రారంభమైనది. ప్రజలు చలికి వణికిపోతున్నారు. చలి గాలుల నుండి ఉపశమనం పొందేందుకు ఉన్ని దుస్తులు ఎంతో మంచిది. చలిగాలికి శరీరాన్ని కాపాడుకునేందుకు వినియోగించే ఉన్ని దుస్తులకు ప్రస్తుత కాలంలో మంచి గిరాకీ ఉంది. రకరకాల ఉన్ని దుస్తులను తయారు చేసి వాటినే స్థావరంగా ఏర్పాటు చేసుకొని మధ్యప్రదేశ్ కు చెందిన యువకులు వ్యాపారులు చేస్తున్నారు.
సహజంగా చలి ప్రభావం ఉండే ఉత్తర భారతదేశం నుండి ప్రత్యేకంగా ఈ వ్యాపారం చేసేవారు ఇతర ప్రాంతాలకు వెళుతుంటారు. మూడు నెలల పాటు అమ్మకాలు చేసేందుకు అవసరమైన ఉన్ని దుస్తులను తీసుకువస్తారు. చలి వాతావరణం ఉన్నంతకాలం కుటుంబాన్ని వదిలి వ్యాపార పనుల్లోనే ఉంటారు. లూథియానా నుండి తీసుకువచ్చిన అందమైన ఉన్ని దుస్తులు పలు రకాల మోడల్స్ లో ఉన్నాయి. చిన్న పిల్లలు నుండి పెద్దవారి వరకు మనసుకి నచ్చిన మోడల్లాలో ఉన్నాయి. వాహనాలపై వెళ్ళేవారు చాలిగాలిని తట్టుకోడానికి టోపిలు వచ్చేలా కూడా ఉన్ని దుస్తులు ఉన్నాయి.
పొట్ట చేతపట్టుకొని ఆ రాష్ట్రం నుండి మనరాష్ట్రానికి వచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు. సామాన్యులకు కూడా అందుబాటులో ఉన్న ధరలతో కూడిన ఉన్ని దుస్తులును విక్రయిస్తున్నారు. అవే దుస్తులు సాధారణంగా పెద్ద షాపుల్లో అధిక ధర పెట్టి కొంటాం. కానీ ఇటువంటి స్థావరాలలో మాత్రం సామాన్యులకు అందుబాటులో ఉండేలా స్వేటర్లు, రగ్గులు, దుప్పట్లు, చిన్నపిల్లలకు వేసే ఉన్ని దుస్తులు ఉన్నాయి. మధ్యతరగతి ప్రజలు కూడా ఇక్కడే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. స్వేటర్లు రూ.350 నుండి రూ.1200వరకు, రగ్గులు రూ.200 నుండి రూ.700 వరకు ఉన్నాయని చెబుతున్నారు.