Home సినిమా డియర్ కామ్రేడ్… దేవరకొండ విజయ్

డియర్ కామ్రేడ్… దేవరకొండ విజయ్

382
0

”డియర్‌ కామ్రేడ్‌” అంటే కమ్యూనిష్టు బ్రాండ్‌ నేమ్‌.
కమ్యూనిస్టు భావాలూ కలిగిన మనలాంటి లెఫ్ట్ యూత్ కి,
ఈ తరానికి ఈ స్టైల్లో డియర్ కామ్రేడ్ మాత్రం అదుర్స్….
– కమ్యూనిస్టు భావాలున్న కాలేజీ కుర్రాడు. స్టూడెంట్ యూనియన్ లీడర్ చైతన్య అలియాస్‌ బాబీ (విజయ్‌ దేవరకొండ)….
– భావాలకు, ప్రేమకు మధ్య జరిగే సంఘర్షణ ప్రేమకథే డియర్‌కామ్రేడ్‌….. – ప్రేమకథను, కమ్యూనిస్టు భావజాలాన్ని, సామాజిక సమస్యను కూడా డిస్కస్‌ చేయాలనుకున్నా, డియర్‌ కామ్రేడ్‌ అని పేరు పెట్టిన దర్శకుడు భరత్‌ కమ్మను సాహసోపేతమైన, దమ్మున్న దర్శకుడనకుండా ఉండలేము.
– హీరో ఇంటిపై ఎర్రజెండా ఎగురుతూ ఉంటుంది. స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫీస్‌లో నిలువెత్తు సుందరయ్య, చే గువేరా ఫోటోలతో పాటు సీపీఐ(ఎం) మొదటి పోలిట్‌ బ్యూరో సభ్యుల చిత్రపటం కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తే వారి ఆశయాల కోసం ఆ సంఘంలో పనిచేస్తున్న అర్థం స్ఫురిస్తుంది.
– అసలైన పాయింట్‌ సగటు నేటి సమాజంలో ఆడపిల్లలపై వేధింపులు ఎలా ఉన్నదో వివరించాడు. ఒకరకంగా చూస్తే ప్రస్తుతం మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌పై వేధింపులూ గుర్తుకువస్తాయి. ఏదొక రంగంలో రాణించాలని కోరుకునే సాధారణ అమ్మాయిలపై వేధింపులు చూస్తూనే ఉన్నాం….
– కామ్రేడ్‌ అంటేనే ఏదోవిధంగా ఫీలయ్యే యువత ఆ పదం పలికేలా చేశాడు.
‘ఏ కష్టనష్టాలు ఎదురైనా మన వెంటుండే వాడే కామ్రేడ్‌..! అలా ఉండగలిగే వాడు కామ్రేడ్‌ ఒక్కడే..!’ అంటూ క్లారిటీ.
ఈతరం విద్యార్థులు, యువత ఎర్రజెండా అంటే కామ్రేడ్‌ అంటే ఏంటో, ఈ పాటి స్వేచ్ఛ ఎలా వచ్చిందో కూడా తెలియకుండా ఉన్నారు. వారిని ఆలోచింపచేసేందుకు ఎంతోకొంత ఉపయోగపడుతుంది.
ఎమోషనల్‌ సీన్లలో విజయ్‌ దేవరకొండ నటన గుర్తుండిపోతుంది.
రష్మిక మాత్రం కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది.
– ఉద్యోగావకాశాలు ఇవ్వలేని, విద్యార్థుల సమస్యలు కోకొల్లలు ….
– ప్రతి యువతికీ ఒక కామ్రేడ్‌ ఉండాలి ..
– జీవితంలో కష్టాలను పరిష్కారం చేసే కామ్రేడ్‌ లాగా ఆలోచించే వారు ఒక్కరున్నా చాలు మనం ప్రపంచంతో పోరాడగలం. ‘నా లైఫ్‌లో ఒక కామ్రేడ్‌ ఉన్నాడు కనుకనే నేను ఈ రోజు గెలువగలిగాను..’ అని కామ్రేడ్‌ ప్రాధాన్యతను అపర్ణాదేవి(రష్మిక) చెప్పడంతో కథ ముగుస్తుంది.