Home బాపట్ల రోటరీ ఆధ్వర్యంలో డాన్స్‌ బేబి డాన్స్‌

రోటరీ ఆధ్వర్యంలో డాన్స్‌ బేబి డాన్స్‌

33
0

చీరాల (Chirala) : రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ సామాజిక భవనంలో యువజన వారోత్సవాల్లో భాగంగా ఆదివారం 8వ రోజు డ్యాన్స్ బేబి డ్యాన్స్ సోలో, గ్రూపు పోటీలు నిర్వహించారు. వివిధ పాఠశాలల నుండి 100 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా గుర్రం రాఘవరావు, భావన, వలివేటి మురళీకృష్ణ వ్యవహరించారు. రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పిశివన్నారాయణ, అసిస్టెంట్ గవర్నర్ నాగభైరు శ్రీనివాసరావు చేతుల మీదుగా విజేతలకు బహుమతులు, మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జాలాది కృష్ణమూర్తి, తిరుమలశెట్టి లక్ష్మీ ప్రతాప్, పోలుదాసు రామకృష్ణ, ఎంవి రామారావు, చీరాల కృష్ణమూర్తి, డాక్టర్‌ ఐ బాబూరావు, డివి సురేష్, కె శివ రంగనాయకులు, మోహనరావు, వీరాంజనేయులు, నక్కల సురేష్, కె ఆంజనేయులు, గుద్దంటి రమేష్, శంకరరెడ్డి, బాల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.