Home బాపట్ల స్మార్ట్ మీటర్లు తొలగించాలని ఆందోళన

స్మార్ట్ మీటర్లు తొలగించాలని ఆందోళన

93
0

చీరాల : పెంచిన విద్యుత్ చార్జీలు తక్షణమే తగ్గించాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ కోరారు. వినియోగదారులకు భారం కానున్న స్మార్ట్‌ మీటర్లను తక్షణం తొలగించాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ గడియార స్థంభం సెంటర్‌ నుండి స్థానిక తహశీల్దారు ర్యాలి నిర్వహించారు. తహశీల్దారు గోపి కృష్ణకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని అన్నారు. అమ్మమంటే అడవి కొనమంటే కొరివిలా వున్నాయని అన్నారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని, తక్షణమే నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లావణ్య, వేంకట చలపతి, సుబ్బారావు, వెంకట్రావు, అప్పారావు పాల్గొన్నారు.