Home ఆంధ్రప్రదేశ్ ఉన్నత వర్గాల పార్టీలు బలహీనవర్గాల ఓట్ల కోసమే : మాజీ మంత్రి డాక్టర్ పాలేటి

ఉన్నత వర్గాల పార్టీలు బలహీనవర్గాల ఓట్ల కోసమే : మాజీ మంత్రి డాక్టర్ పాలేటి

378
0

చిరాల : ఉన్నత వర్గాల రాజకీయ పార్టీల నాయకులు దళితుల ఓట్ల కోసం మాత్రమే పనిచేస్తాయని, అక్కడి సభల్లో పాల్గొనడం కన్నా దళిత, బలహీన వర్గాల ప్రజల సభలో పాల్గొనడమే తనకు ఆసక్తి ఉంటుందని మాజీమంత్రి డాక్టర్ పాలేటి రామారావు అన్నారు. అంబెడ్కర్ భవన్లో ఆదివారం రాష్ట్రస్థాయి దళిత బహుజన సంఘాల మేధోమదన సదస్సులో ఆయన మాట్లాడారు. సామాజిక మార్పు కోరుకునే వారికి చీరాల ప్రయోగశాల అన్నారు. దళితులు, బిసిలు అధికంగా ఉన్న చీరాలలో ప్రభుత్వ ప్రోత్సాహంతో జరుగుతున్న దాడులను నివారించే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

దళితులపై దళితులు, బీసీలపై బీసీలను ఉసికొల్పి దాడులకు పాల్పడే దుర్మార్గమైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని చేనేత జనసమాఖ్య అధ్యక్షులు మాచర్ల మోహనరావు అన్నారు. సభలో వైసిపి నాయకులు డాక్టర్ వరికూటి అమృతపాని, ఎఎన్యూ ప్రొఫెసర్ అబ్దుల్ నుర్బాష, జర్నలిస్ట్ ఖాన్ ఎస్దాని, బక్కా పరంజ్యోతి, వై కొటేశ్వరవు, అంబురు సుబ్రహ్మణ్యం, పలుకురి ప్రసాద్, ఎన్ఎమ్ ధర్మ, సంగా భానుమిత్ర, సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, ఐఎల్టీడీ ఫెడరేషన్ కార్యదర్శి గోసాల సుధాకర్, పొదిలి ఐస్వామి, అబ్దుల్ రహీం, పిన్నిక శ్రీనివాసరావు, ఎంపిపి గవిని శ్రీనివాసరావు, దామర్ల శ్రీకృష్ణ, వైజి సురేష్, మద్దు ప్రకాశరావు, సిపిఐ కార్యదర్శి మేడా వెంకటరావు, ఉటుకురి వెంకటేశ్వర్లు, అందే విష్వశ్వరరావు, దుడ్డు విజయ్ సుందర్, పులిపాటి రాజు, కర్నేటి రవి పాల్గొన్నారు.