తెలుగు సినీ పరిశ్రమలో ఓ దుష్ప్ర్రచారం ఉండేది. తెలుగు అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు రావు అని. కొన్ని సన్నివేశాల్లో నటించేందుకు వాళ్లు ఇబ్బందిగా ఫీల్ అవుతారనే టాక్ ఫస్ట్ నుంచి ఉంది, అందుకే తెలుగు హీరోయిన్లు సినిమాల్లో పెద్దగా కనించరు అని అంటారు కొందరు. అయితే వీటన్నింటిని తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా పటాపంచలు చేసింది. తన ప్రతిభతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎదిగింది. తెలుగులో ‘బందిపోటు, అమీతుమీ’, ‘రాగల 24 గంటల్లో’లాంటి సినిమాల్లో నటించి అదరగొట్టింది. నాని ‘అ’ మూవీలో ఈషా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీరరాఘవ’లో హీరోయిన్ చెల్లి పాత్ర చేసింది. ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఇందుకు కరోనా మహమ్మారి కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.
ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేవేశారు. అటు షూటింగ్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక సినిమా షూటింగులు షురూ కానున్నాయి. దీంతో ఈషా రెబ్బా బిజీ నటిగా మారేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఫొటో షూట్‌ను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లింది. తన అందాలను చూపిస్తూ ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎర్ర చీరలో ఉన్న ఈషా తన క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కట్టిపడేసింది. దీంతో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. రెడ్ శారీలో ఈషా రెచ్చిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే ఈషా చాలా కష్టపడుతోందని అంటున్నారు.
అయితే తాను గ్లామరస్ పాత్రలు చేసేందుకు సిద్ధమేనని గతంలో ఈషా రెబ్బా ప్రకటించింది. తాను హాట్ గాళ్ అని కూడా అన్నారు. తనకు సూట్ అయ్యే పాత్రలను ఎన్నుకుంటానని ఆమె అప్పట్లో తెలిపారు. ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్‌ల్లో చేస్తున్నారు. అటు బాలీవుడ్‌లోనూ ఈషాకు అవకాశం వచ్చిందని తెలుస్తోంది. మరి ఇంతలా రెచ్చిపోయి సోషల్ మీడియాలో అందాల విందు పండగ చేసిన ఈషా రెబ్బాకు మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయేమో చూడాలి.