Home ప్రకాశం సచివాలయంలో పౌర సేవలన్ని రాజకీయాలకు అతీతంగా అందించాలి : సిపిఎం

సచివాలయంలో పౌర సేవలన్ని రాజకీయాలకు అతీతంగా అందించాలి : సిపిఎం

220
0

ఒంగోలు : 49వ డివిజన్ సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో వార్డు సచివాలయంలోని ముఖ్య కార్యదర్శిని కలిసి స్థానిక సమస్యలను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముక్యంగా అర్హులైన పేదలకు ఇంటిస్థలం ఇవ్వాలని, ఇప్పుడు ప్రకటించిన లిస్టులోని అనర్హులను గుర్తించి, అర్హులకు చోటు కల్పించాలని కోరారు. రేషన్ కార్డు సమస్యలన్నీ సచివాలయంలోనే పరిష్కరించాలని, పేర్లు తొలగించాలన్నా, నూతనంగా చేర్చాలన్నా రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, అందువలన రేషన్ కార్డు సమస్యలన్నీ సచివాలయంలోనే పరిష్కరించాలని కోరారు. సచివాలయసిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చి, పౌర సేవలన్ని రాజకీయాలకు అతీతంగా అందరికీ అందేలా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం నుండి జీతం తీసుకునే ప్రతి వారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాద్యులేనని సీపీఎం కమిటీ కార్యదర్శి గంధవళ్ళ బాలక్రిష్ణ అన్నారు. కార్యక్రమంలో వేమూరి మాలకొండయ్య, పాపని సుబ్బారావు, కర్నాటి గురుస్వామి, తోకా వీరయ్య, వేము ఖాసీం, ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.