Home జాతీయం సిపిఐ (ఎం) అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా కామ్రేడ్ ఎంఎ బేబీ ఎన్నిక

సిపిఐ (ఎం) అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా కామ్రేడ్ ఎంఎ బేబీ ఎన్నిక

12
0

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) (సీపీఎం) అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఎంఎ బేబీ ఎన్నికయ్యారు. మధురైలో మూడు రోజులపాటు జరిగిన సిపిఎం 24వ అఖిల భారత మహాసభలో నూతన కార్యదర్శితోపాటు పొలిట్ బ్యూరో, 85మందితో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. బేబీ గతంలో కేరళ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సీతారాం ఏచూరిగారి తర్వాత బేబీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించబోతున్నారు.

కేరళ ప్రక్కులంలో 1954లో బేబీ జన్మించారు. పీఎం అలగ్జాండర్, లిల్లీ ఆయన తల్లిదండ్రులు, 1986 నుంచి 1998 వరకూ రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. విద్యార్థి ఉద్యమం (ఎస్ఎఫ్ఐ) నుంచి ఆయన ప్రస్థానం ప్రారంభమైంది.

పోలిట్ బ్యూరోలో తెలుగు రాష్ట్రాల నుంచి బీవీ రాఘవులు కొనసాగుతుండగా కొత్తగా ఆర్ అరుణ కుమార్ ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర కమిటీకి వి శ్రీనివాసరావు, కె లోకనాథం, డి.రమాదేవి ఎన్నికవగా తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రం, ఎస్ వీరయ్య, జాన్ వెస్లీ, టి జ్వోతి ఎన్నికయ్యారు.