చీరాల : పట్టణంలో మురుగునీటి పారుడలుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ మునిసిపల్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు మాట్లాడారు. నూతనంగా నిర్మించిన కాలువలు కూడా నీటి పారుదల లేక మురుగు నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ధర్నా అనంతరం కమిషనర్ షేక్ ఫజులుళ్లకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం వసంతారావు, దేవతోటి నాగేశ్వరరావు, డి నారపరెడ్డి, గోసాల సుధాకర్ లింగం జయరాజు, ఎవి రమణ, జి గంగయ్య, పి సాయిరాం, ఎం రామచంద్రరావు, సత్యమూర్తి పాల్గొన్నారు.